సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగ జ్యోతి అన్నారు. బుధవారం మండలములోని 19 గ్రామ పంచాయతీలలో 96 ఎన్యుమరెటర్స్ బ్లాక్ లకు 96 మంది ఎన్యుమరెటర్స్ నియమించి సర్వే కొనసాగించడం జరిగిందన్నారు. మండలములోని ధర్మసాగర్,సాయిపేట గ్రామాలను సందర్శించడము జరిగినది. ఈ సందర్శనలో ఇంటి ఇంటి సర్వే చేస్తున్న ఎన్యుమారెటెర్స్ మరియు సూపర్ వైసర్స్ తో మాట్లాడి తగు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం ధర్మసాగర్, శాయిపేట, దేవనూరు గ్రామములో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, నిర్వాహకులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు.కార్యక్రమములో ఎం.పి.డి.ఓ.,కె. అనిల్ కుమార్,ఎం.పి.ఓ,ఆఫ్జల్, ఏ.పి.ఓ సంపత్,ఏ.పి.ఏం.అనిత సమగ్ర కుటుంబ సర్వే ఎన్యుమరెటర్స్ సూపర్ వైసర్స్,పంచాయతి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.