
నవతెలంగాణ – మాక్లూర్
ప్రతీ ఒక్కరూ రజాకార్లు సినిమాను చూడాలని, గతంలో మన బ్రతుకులు ఎలా ఉండేవనేది తెలుస్తుందన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, సాదిముబరక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాక్లూర్ మండలంలో 102, అల్లూరు మండలంలో 22, మొత్తం 124 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఉండాలని, అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. రాజకీయ నాయకుల అందరం కలిసే ఉంటామని, మీరు కూడా కలిసి ఉండాలని, వచ్చే ఎన్నికల్లో ఎవ్వరికీ నచ్చిన పార్టీకి వాళ్ళు వేసుకోవాలని సూచించారు. ఎన్నికలప్పుడు రాజకీయమని, ఎన్నికల తరువాత అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ డి. విఠల్ రావు, ఎంపిపి ప్రభాకర్, స్థానిక ఎంపిటిసి వేకటేశ్వర్ రావు, తహశీల్దార్ షబ్బీర్, ఎంపీడీఓ క్రాంతి, లబ్దిదారులు పాల్గొన్నారు.