నవతెలంగాణ-హైదరాబాద్ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్)కు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని పేర్కొన్నాయి. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 21. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ అంచనా ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 15-21, జెడ్‌పీఎంకు 12-18, కాంగ్రెస్‌కు 2-8, బీజేపీకి 0 సీట్లు రానున్నాయి. ఇండియా టీవీ- సీఎన్‌ఎక్స్ ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 14-18, జెడ్‌పీఎంకు 12-16, కాంగ్రెస్‌కు 8-10, బీజేపీకి 0-2 స్థానాలు దక్కనున్నాయి. జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 10-14, జెడ్‌పీఎంకు 15-25, కాంగ్రెస్‌కు 5-9, బీజేపీకి 0-2 సీట్లు రానున్నాయి. రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ అంచనా ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 17-22, జెడ్‌పీఎంకు 7-12, కాంగ్రెస్‌కు 7-10, బీజేపీ 1-2 స్థానాల్లో గెలువనున్నాయి. టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 14-18, జెడ్‌పీఎంకు 10-14, కాంగ్రెస్‌కు 9-13, బీజేపీకి 0-2 సీట్లు దక్కనున్నాయి.