ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

నవతెలంగాణ-హైదరాబాద్ :  దీర్ఘ‌కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ప్ర‌ముఖ పంజాబీ, హిందీ ద‌ర్శ‌కుడు, న‌టుడు మంగ‌ళ్ థిల్లాన్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. లూధియానా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న మ‌ర‌ణించారు. మంగ‌ళ్ థిల్లాన్ పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాలో ఓ సిక్కు కుటుంబంలో జ‌న్మించారు. యూపీలోని ల‌ఖింపూర్ ఖేరి జిల్లాలో ప్రాధ‌మిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆపై ఢిల్లీలో నాట‌క రంగంలో కెరీర్‌ను ఆరంభించారు. 1980లో యాక్టింగ్‌లో ఆయ‌న పీజీ డిప్లొమా పొందారు. టీవీ షో క‌థా సాగ‌ర్‌తో 1986లో మంగ‌ళ్ థిల్లాన్ వినోద రంగంలో అడుగుపెట్టారు. అదే ఏడాది బునియాద్ అనే మ‌రో టీవీ షోలో క‌నిపించారు. జునూన్‌, కిస్మ‌త్‌, గ్రేట్ మ‌రాఠా, గుట‌న్‌, సాహిల్‌, మౌలానా ఆజాద్ వంటి టీవీ షోల్లో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఖూన్ భారీ మాంగ్‌, జ‌క్మి ఔర‌త్‌, ద‌యావ‌న్‌, క‌హ‌న్ హై కానూన్‌, నాకా బందీ, అంబ‌, అక‌ల్య‌, జ‌న‌షీన్, ట్రైన్ టూ పాకిస్తాన్‌, దలాల్ వంటి సినిమాల్లోనూ న‌టించారు. మంగ‌ళ్ థిల్లాన్ చివ‌రిసారిగా 2017లో తూఫాన్ సింగ్ సినిమాలో క‌నిపించారు.

Spread the love