నవతెలంగాణ- నారాయణపేట
నారాయణపేట కలెక్టరేట్‌లో సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి గ్రామానికి చెందిన నడిమింటి కనకప్పకు రావాల్సిన 31 గుంటల భూమిపై తన అన్న పెద్దకనకప్ప భార్య హనుమమ్మ కబ్జాలో ఉంది. ఈ విషయంపై గ్రామంలో చాలాసార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. రెండేండ్లుగా దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో పలుమార్లు దరఖాస్తులు ఇచ్చినా పరిష్కారం కాలేదన్నారు. దాంతో మనస్తాపానికి గురైన కనకప్ప సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. అక్కడే పురుగుల మందు తాగేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అడ్డుకున్నారు. పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. అనంతరం రైతును జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కలెక్టరేట్లో రైతు ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



