నవతెలంగాణ-రామారెడ్డి : కడుపు నొప్పితో బాధపడుతూ, వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందిన తగ్గకపోవడంతో, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రామారెడ్డి గ్రామానికి చెందిన ఆరగొండ పెద్ద లింగం (62) రోజు మాదిరిగా వ్యవసాయ పొలానికి వెళ్లి, మధ్యాహ్నం దాదాపు గం 1: 30కి సొంత పొలంలో వేప చెట్టుకు నైలాన్ తాడు తో ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య అరగొండ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.