ప్రపంచ మానవాళికి జీవనాధారం రైతు

– వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజా
– అమ్మపల్లి శివారులో ప్రపంచ రైతు దినోత్సవ వేడుకలు
– రైతులను సన్మానించిన భూ వ్యవసాయ శాస్త్రవేత్తలు
నవతెలంగాణ-శంషాబాద్‌
ప్రపంచ మానవాళికి ఆహారాన్ని అందించి ఆదుకుం టున్న ఘనత రైతులకు మాత్రమే దక్కుతుందని రాజేం ద్రనగర్‌ భారతీయ నేల, భూ ఉపయోగ అధ్యయన సం స్థ శాస్త్రవేత్త డాక్టర్‌ డి.రాజా అన్నారు. శనివారం శంషా బాద్‌ మండల పరిధిలోని అమ్మపల్లి శివారులోని పయల మల్లేష్‌, లింగం రామారావు వ్యవసాయ భూమిలో ప్రపం చ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించా రు. ప్రపంచానికి రైతే వెన్నెముక అని భావించి రైతులను గౌరవించాలన్న ఉద్దేశంతో శాస్త్రవేత్తలు కార్యక్ర మాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రైతులను శాలువాలతో సన్మానించి ప్రపంచ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి ఆహారాన్ని ఉత్పత్తి చేసి మా నవ మనుగడకు ప్రధాన కారకులుగా రైతులు ఉన్నారని తెలిపారు. రాత్రనకా పగలనకా ఎండనకా వాననకా అ న్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ పంటలు పండిస్తూ ప్రజలకు అందిస్తున్నా రని అభినందించారు. అలాంటి రైతును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. భూమిలో ఉండే మృతిక సారవంతమైన నేలల గురించి రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు వాడటం వల్ల జరిగే అనర్ధాల గురించి వివరించారు. సాధ్యమైనంత మేరకు పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నా రు. దానికి బదులుగా సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట వాడకం వాడే విధానం గురించి రైతులకు తెలిపారు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు చేయించి ఏ నెలలో ఏ పంటలు ఎక్కువగా పండే అవకాశం ఉందో ఆ రకమైన పం టలు పండించాలన్నారు. సారవంతమైన నేల కోతకు గురికాకుండా (క్రమక్షేయం) రైతులు జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. రైతు శ్రమను గుర్తించి ప్రపంచ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. బాగా కష్టపడి పంటలు పండిస్తున్న రైతులందరినీ అభి నందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వై.సురేష్‌ కరంవీర్‌ డాక్టర్‌ అమ్ములు సండే, జయ తంగడే, నాగేంద్ర, కావ్య, చేతన, అమ్మపల్లి శివారు రైతులు పాల్గొన్నారు.

Spread the love