గంజాయి తరలిస్తున్న నిందితుని అరెస్టు

– రూ.3 లక్షలు విలువ చేసే 12 కిలోల గంజాయి స్వాధీనం.
– వివరాలు వెల్లడించిన సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ బాల్ రామ్.
నవతెలంగాణ-ఆమనగల్
‌   ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి రూ.3 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఆమనగల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ బాల్ రామ్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గ్రామానికి చెందిన బైరి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ప్రాంతానికి చెందిన శ్రీలత నుండి కొనుగోలు చేసిన గంజాయిని కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ఉమేష్ కు విక్రయించడానికి ఈనెల 17న మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి ఆమనగల్ మీదుగా  బెంగుళూరు వెళ్తున్నాడు. విశ్వాసనీయ సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న 12.531 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈమేరకు కేసు నమోదు చేసి శ్రీనివాస్ ను రిమాండ్ కు తరలించి పరారీలో ఉన్న శ్రీలత, ఉమేష్ లకోసం గాలిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయి తరలిస్తున్న నిందితుని అదుపులోకి తీసుకున్న ఆమనగల్ పోలీసులను ఉన్నత అధికారులు అభినందించారు.
Spread the love