కంగనా రనౌత్ పై రైతులు ఆగ్రహం

నవతెలంగాణ ఢిల్లీ: బీజేపీ అభ్యర్థి కంగన రనౌత్‌పై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2021-22లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులను కించపరచినందుకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి. సంయుక్త కిసాన్‌ మంచ్‌ కన్వీనర్‌ హరీశ్‌ చౌహాన్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ, నాడు జరిగిన రైతు ఉద్యమంలో పాల్గొన్న పంజాబ్‌ మహిళా రైతును కంగన తప్పుగా చిత్రీకరించి, రైతులను కించపరిచారని తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న బిల్కిస్‌ బానో (80)గా ఆ పంజాబ్‌ రైతును పేర్కొన్నారని చెప్పారు. వాస్తవాలను కొందరు యూజర్లు బయటపెట్టిన తర్వాత కంగన తన ట్వీట్‌ను డిలీట్‌ చేశారని ఆయన  తెలిపారు. కాబట్టి, ఈ ఎన్నికలల్లో ఆమె ఓట్లు అడిగే ముందు హిమాచల్‌ ప్రదేశ్‌ రైతులకు క్షమాపణ చెప్పాలని అన్నారు.

Spread the love