నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో గురువారం నాడు ఒకపక్క లక్ష లోపు రుణమాఫీ సంబరాలు మరోపక్క భారీ వర్షంతో రైతన్నలు హర్షం వ్యక్తం అయింది. ఈ మండల రైతులు వర్షం కోసం రుణాల మాఫీ కోసం ఎదురు చూస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక లక్ష లోపు రుణ రైతులకు రుణమాఫీ నీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తూ లాంఛనంగా ప్రారంభించగా.. మరోపక్క వర్షం కోసం గ్రామదేవతలకు జలాభిషేకాలు ఆలయాల్లో అన్నదానాలు రైతన్నలు చేపడుతుండగా.. వరుణుడు కరుణించలేకపోయాడు. ఇటు ప్రభుత్వం రుణమాఫీ చేసిన రోజే అటు వరుణుడు కరుణిస్తూ భారీ వర్షాన్ని కురిపించడంతో మద్నూర్ ఉమ్మడి మండల రైతుల్లో హర్షం వ్యక్తం అయింది.