రైతులు ఆందోళన చెందొద్దు

– ప్రభుత్వం ఆదుకుంటుంది
– బీఅర్‌ఎస్‌ లాగా మాటల ప్రభుత్వం కాదు
– కాంగ్రెస్‌ది చేతల ప్రభుత్వం
– నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారం వస్తుంది
– కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్‌ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
మంగళవారం రాత్రి వడగండ్ల వానకు, అకాల వర్షా నికి నష్టపోయిన రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తుందని కాంగ్రెస్‌ రాష్ట్ర నా యకులు కొంగర విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంచాల మండల పరిధిలోని ఆరు ట్ల, చెన్నరెడ్డి గూడ, బండ లేమూర్‌ గ్రామాల్లో మామిడి, బొప్పాయి తోటలను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ..10ఏండ్లలో అతివృష్టి, అనావృష్టికి నష్టపోయిన రైతులకు బీ అర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడు ఆదుకోలేదని, నష్టపరిహారం ఇవ్వలే దని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఅర్‌ఎస్‌ ప్రభు త్వంలాగ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమ న్నారు. గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు, అకాల వర్షానికి నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు వింజమూరి రాంరెడ్డి, ఎంపీటీసీలు కావలి శ్రీనివాస్‌, ఎడమ నరేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ డైరక్టర్లు వెదిరే హనుమంతురెడ్డి, జనీగ వెంకటేష్‌, నాయకులు చీమల జంగయ్య యాదవ్‌, కాంగ్రెస్‌ ఆరుట్ల గ్రామాధ్య క్షులు రావుల బాషయ్య, నాయకులు ఏ.యాదయ్య, కే. బుగ్గ రాములు, ఎం.వెంకటేష్‌ యాదవ్‌, జీ.చంద్రయ్య, ఎం.మాసయ్య గౌడ్‌, మార సురేష్‌, ఎస్‌.ఎల్లెష్‌, ఏ.రాజు, ఏ.సురేష్‌, మాదగొని జంగయ్య గౌడ్‌ తదితరులున్నారు.

Spread the love