అకాల వర్షానికి నష్టం

– వడగండ్ల వానకు పగిలిన పౌల్ట్రీ ఫారాల, ఇండ్ల పై కప్పుల రేకులు
– ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి
– సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు, రైతు సంఘం నాయకులు పగడాల వెంకటేష్‌
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు, మామిడి తోట పాడై పోవడం, పౌల్ట్రీ ఫారాల, ఇండ్ల పై కప్పుల రేకులు పగిలిపోయాయని నష్టపోయిన వారికి ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు, రైతు సంఘం నాయకులు పగ డాల వెంకటేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధ వారం మంచాల మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామ సీపీఐ(ఎం) గ్రామ కమిటీ అధ్వర్యంలో పగిలిన పౌ ల్ట్రీ ఫారం రేకులను, ఇండ్లపై కప్పులను పరిశీలించారు. ఆయన ప్రతినిధులతో మాట్లాడుతూ.. చెన్న రెడ్డి గూడ గ్రామంలో చీమల యాదయ్య మామిడి తోట, పగడాల జంగయ్య పౌల్ట్రీ ఫారం రేకులు, బెల్లి ఆడవయ్య ఇంటిపై కప్పు రేకులు, ఎర్రమోని మహేష్‌ పౌల్ట్రీ ఫారం రేకులు పగిలి పోయిందని, ఇలాంటి అకాల వడగండ్ల వాన చాల మంది రైతుల, ప్రజలను పీకల్లోతు కష్టాల్లో ముంచింద న్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సర్వే నష్ట పరిహారం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు అంతటి చం ద్రయ్య, బెల్లి పాండు, చెన్న రెడ్డిగూడ సీపీఐ(ఎం) గ్రామ కమిటీ పాల్గొన్నారు.

Spread the love