ఎండి పోయిన పంట పొలాల రైతులను ఆదుకోవాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి 
నవతెలంగాణ  – ఆత్మకూరు(ఎస్)
వర్షా బావ పరిస్థితులు మరియు భూగర్భ జలాలు అడుగంటడం వల్ల వంట పొలాలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని నిమ్మికల్ గ్రామంలో జటంగి వెంకన్న అనే రైతు ఎండిపోయిన పంట పొలాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ యాసంగి కారులో రైతులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు బోరు బావుల ఆధారంగా వరి సాగు విస్తారంగా సాగు చేశారని అన్నారు. కానీ సకాలంలో నీరు లేక మరియు వర్ష భావ పరిస్థితుల వల్ల బోర్లు ఎండిపోయి సాగుచేసిన పంట పొలాలు పెద్ద ఎత్తున ఎండిపోయాయని అన్నారు. రైతులు ఎకరం ఒక్కంటికి దాదాపు 25 వేల నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మికల్ గ్రామంలోని దాదాపు 250 ఎకరాలు వరి పంట ఎండిపోయిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాలలో వరి పంట ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వము, అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారించి ఎకరాకు 25000 నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకటరెడ్డి, దండ శ్రీనివాస్ రెడ్డి, రేణిగుంట్ల రవి, కొల్లు వెంకన్న గంపల ఎల్లయ్య, విజయ్ రెడ్డి, బయ్య రాములు తదితరులు పాల్గొన్నారు.
Spread the love