పార్లమెంట్ ఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలి…

–  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జెండాగే…
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిర్వహించవలసిన విధులు, బాధ్యతల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే నోడల్ అధికారులకు సూచించారు. శనివారం నాడు కాన్ఫరెన్స్ హాల్లో ఆయన వివిధ విభాగాలకు నియమింపబడిన నోడల్ అధికారులతో సమావేశమై మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో భువనగిరి, ఆలేరు, ఇబ్రహీంపట్నం, జనగాం, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. వివిధ స్థాయిలలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని నియమించి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, ఎన్నికల సిబ్బందిని తరలించే  వాహనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ పర్యవేక్షించే టీములు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని  అతిక్రమించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే 24,  48, 72 గంటలలో చేయవలసిన విధుల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని, అందుకు సంబంధించిన టీములను క్షేత్రస్థాయిలో పనిచేసేలా సిద్ధం చేసుకోవాలని తెలిపారు.  “సి”విజిల్  యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను వంద నిమిషాలలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, యాప్ పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ” సువిధ ” యాప్ ద్వారా రాజకీయ సభలు, ర్యాలీలు,  వివిధ శాఖలు ఇవ్వాల్సిన అనుమతులను నిబంధనల ప్రకారం సకాలంలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారము జప్తు చేసిన నగదు,  వస్తువులను స్క్వాడ్ టీములు, పోలీస్ అధికారులు సమన్వయంతో సీజర్ యాప్ లో నమోదు చేయాలని సూచించారు.  నియోజకవర్గాలకు సంబంధించిన ఎం సి సి  టీములు సమన్వయం చేసుకోవాలని, టీములకు కావలసిన  ఐడి కార్డులు, డ్రెస్ కోడ్స్ ఇవ్వాలని సూచించారు. స్క్వాడ్ టీములకు సంబంధించిన చెక్ పోస్టులు, పాయింట్ల వద్ద  వేసవి ఉన్నందున అన్ని వసతులు కల్పించాలని, కావలసిన రిజిస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.  ఓటర్ సమాచార స్లిప్పులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి అందేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు కావలసిన వసతులు, వీల్ చైర్ల పట్ల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ పూర్తి అయిందని, ఈవీఎం మేనేజ్మెంట్  అయిపోయిందని తెలిపారు. నోడల్ అధికారులు సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు, అడిషనల్ డీసీపీ, లా అండ్ ఆర్డర్ నోడల్ అధికారి  సిహెచ్ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి, బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి వి శేఖర్ రెడ్డి,  జిల్లా విద్యాశాఖ అధికారి,  మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి కే నారాయణరెడ్డి, అడిషనల్ డిఆర్డిఓ., ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి జి సురేష్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, కంప్యూటరైజెషన్, సైబర్ సెక్యూరిటీ,  ఐటీ నోడల్ అధికారి జి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్తు డిప్యూటీ సీఈవో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ అధికారి డి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి, మీడియా నోడల్ అధికారి పి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి,  కమ్యూనికేషన్ ప్లాన్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి జయపాల్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, కంప్లైంట్స్ రిడ్రెస్సెల్,  ఓటర్ హెల్ప్ లైన్ నోడల్ అధికారి ఆర్. సునంద, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి, పిడబ్ల్యుడి ఓటర్ల నోడల్ అధికారి కే కృష్ణవేణి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరు, ఏఎంఏఫ్ , స్ట్రాంగ్ రూమ్,  కౌంటింగ్ సెంటర్స్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఫైర్ ఆఫీసర్, ఫైర్ సేఫ్టీ నోడల్ అధికారి అశోక్, జిల్లా రవాణా అధికారి శ్యాంప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వర చారి, సూపరింటెండెంట్లు రామారావు,  రామ్మూర్తిలు పాల్గొన్నారు.
Spread the love