తడిసిన వేరుశనగ, దళారులకు అమ్ముకుంటున్న దాన్యం రైతులు

– తడిసి మొలకెత్తిన వేరుశనగ…
– దళారులకు ధాన్యం అమ్మకాలు…
– రైతును కుదేలు చేసిన అకాల వాన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యయప్రయాసలకు ఓర్చి ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే తరుణంలో అకాల వానలకు తడిసి ముద్ద అవడంతో రైతు పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి లా తయారు అయింది.దీంతో దిన దిన గండం నూరేళ్ళు ఆయుస్సు లా మారింది సాదారణ రైతు పరిస్థితి. అతివృష్టి అనావృష్టి లను తట్టుకుని పంట పండించిన మద్దతు ధర దక్కకపోవడం విచారకరం. మండలంలో రబీ పంట గా వరి 15 వందల ఎకరాల్లో,వేరుశనగ వేయి ఎకరాల్లో సాగు చేసారు.వరి కోసి కల్లా లు లో ఉండగా,వేరుశనగ ను యంత్రాలతో వొన్ను చేసుకుంటున్నారు రైతులు. మంగళవారం మధ్యాహ్నం అర్ధగంట పాటు సంభవించిన గాలులు తో కూడిన భారీ వర్షానికి కల్లా లు పై ఉన్న వారి ధాన్యం,పన లుగా పొలంలో ఉన్న వేరుశనగ పంట పూర్తిగా తడిచిపోయింది.దీంతో తడిచిన ధాన్యాన్ని రైతులు దళారులకు ఎంతో కొంత కు అమ్మకానికి పెట్టారు.తడిచి న వేరుశనగ పన లు తిరగేసి ఆర పెడుతున్నారు. అకాల వానలతో అపార నష్టం – రైతు సత్తెనపల్లి వెంకటేశ్వరరావు. ఎనిమిది ఎకరాలు లో వేరుశనగ వేసాను.ఎకరానికి కౌలు తో సహా రూ.80 వేలు పెట్టుబడి తో సుమారు రూ.7 లక్షలు వ్యయం అయింది. గత మూడు రోజులుగా వేరుశనగ పీకి యంత్రం ద్వారా పంటను వేరు చేస్తున్నాం.మంగళవారం వచ్చిన అకాల వానలకు సగానికి పైగా పంట పొలంలోనే ఉంది.తడిచిపోయి మొలకెత్తే పరిస్థితి ఉంది. అధికారులు కానీ,ప్రజా ప్రతినిధులు గానీ రైతులు వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు.

Spread the love