రైతులు విత్తనాలు కోనెటప్పుడు అప్రమత్తంగా ఉండాలి: ఏఈవో

నవతెలంగాణ – జుక్కల్
హంగర్గ క్లస్టర్  పరిదిలోని గ్రామాల  రైతులు విత్తనాలు, ఎరువులు, రసాయన మందులు కొనెటప్పుడు తగు  జాగ్రత్తలు తీసుకోవాలని హంగర్గ క్లస్టర్  తో  పాటు  పెద్దగుల్లా,  నాగల్  గావ్,  డోన్గాం, ఖండేబల్లూర్, జుక్కల్,  నాగల్  గావ్,  హంగర్గ  క్లస్టర్  మండల వ్వవసాయాదికారీ ఆదేశాల మేరకు  గ్రామాలలో  రైతులకు అవగాహన గురువారం నాడు పర్చడం జర్గింది. ఈ  సందర్భంగా  హంగర్గ  క్లస్టర్  పరిదిలోని మాదాపూర్ గ్రామంలో రైతులు విత్తనాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా ఏఈవో విశాల్  అవగాహన కార్యక్రమంలో  మాట్లాడుతు వ్యవసాయశాఖ లైసెన్స్‌ పొందిన డీలరు నుంచే రైతులు విత్తనాలు కోనుగోలు చేయాలి.సీల్‌ సరిగ్గా ఉన్న బస్తాలను, ధ్రువీకరణ పత్రం (ట్యాగ్‌) ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి.బస్తా ప్యాకెట్‌పై గడువు తేదీ, రకం పేరు, లాట్‌ నంబర్లను గమనించాలి.  విత్తనాన్ని ఎంచుకునే ముందు వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవాలి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసిన విత్తనాలుంటే వాటిని తీసుకోవడం ఉత్తమం. అలాగే క్రిమి సంహారక మందులు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో గడువు తేదీ, విత్తనరకం తదితర వివరాలను గమనించాలని అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈఓ విశాల్ గౌడ్, గ్రామ రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Spread the love