రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలి

– కీసర మండల వ్యవసాయ అధికారి వందన
నవతెలంగాణ-కీసర
రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని కీసర మండల వ్యవసాయ అధికారి వందన అన్నారు. మంగళవారం కీసర మండలంలోని యాద్గార్‌పల్లి, కీసర, దాయరా గ్రామ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు కొనే విత్తనాలకు డీలర్ల నుంచి తప్పనిసరిగా బిల్లులు, రశీదులు తీసుకోవాలని తెలిపారు. ఈ రశీదులు పంట కాలం అయిపోయే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు. రశీదు మీద విత్తన కంపెనీ పేరు, విత్తనం రకం, బ్యాచ్‌ నెంబర్‌, లార్డ్‌ నంబర్‌, రేటు తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామాల్లో తక్కువ ధరకు, ఎక్కువ ధరకు అమ్మే వారి వివరాలు వెంటనే వ్యవసాయ అధికారికి తెలియజేయాలని సూచించారు. ఎవరైనా పక్క జిల్లా నుంచి, పక్క రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Spread the love