ఐకెపి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

– రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి
– 48 గంటల్లోపు రైతు ఖాతాలో డబ్బులు జమ
– ఎంపీడీవో గణేష్ రెడ్డి ఏపీఎం కృష్ణారెడ్డి
నవతెలంగాణ – మిరు దొడ్డి 

గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఏ పి ఎం కృష్ణారెడ్డి లు సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లింగుపల్లి, లక్ష్మీనగర్, మల్లుపల్లి గ్రామాలలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావడానికి ముందే వ్యవసాయ పొలాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలన్నారు. ప్రతి రైతు కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి ఉషారాణి ఏఈఓ రేణుక, సీసీలు వైకుంఠం, అక్బర్, సిద్ధిరాములు, బాలరాజు, భాస్కర్, వివోఏ లు మహేష్, కనుకయ్య వెంకట్ లక్ష్మి, శోభ పలువురు పాల్గొన్నారు.

Spread the love