ఆర్ఎస్పీ వేంటే మేము..

– బీఆర్ఎస్ లో చేరిన పలువురు బీఎస్పీ నాయకులు
నవతెలంగాణ-బెజ్జంకి: బడుగుల సంక్షేమం కోసం తన అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణికరించి రాజకీయ అరగేట్రం చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేంటే మేముంటామని మాజీ బీఎస్పీ మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు బోనగిరి ప్రభాకర్ అదివారం స్పష్టం చేశారు. తనతో పాటు పలువురు బీఎస్పీ నాయకులు శనివారం తెలంగాణ భవన్ యందు ఆర్ఎస్పీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు ప్రభాకర్ తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్పీ సూచనలతో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ ఎన్నికకు శాయశక్తుల కృషి చేస్తామని అయన తెలిపారు.

Spread the love