Sunday, June 14, 2026
E-PAPER
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈస్ట్ కామెంగ్ జిల్లాలోని సెప్పా పరిపాలనా పరిధిలో ఉన్న తటాతార గ్రామం సమీపంలో ఎన్‌హెచ్-13 (ఇటానగర్-సెప్పా రహదారి)పై ప్రయాణిస్తున్న బొలెరో పికప్ వాహనం లోయలో పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా అసోంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. శనివారం పక్కే-కెస్సాంగ్ జిల్లాలోని రిలోహ్ మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలిలో నలుగురు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -