- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు మార్గం సుగమం అయింది. ఆదాయం ఆధారంగా పంచాయతీలను నాలుగు రకాలుగా విభజిస్తూ కొత్త గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం, రూ.19 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పంచాయతీలు గ్రేడ్-1, రూ.13 లక్షల నుంచి 19 లక్షల వరకు ఆదాయం ఉన్నవి గ్రేడ్-2, రూ.7 లక్షల నుంచి 13 లక్షల లోపు ఆదాయం ఉన్నవి గ్రేడ్-3, రూ.7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవి గ్రేడ్-4గా వర్గీకరించారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, 12,760 పోస్టులతో కొత్త క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం కార్యదర్శులకు పదోన్నతులు లభించనున్నాయి.
- Advertisement -



