- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఉదయగిరి డిపోకు చెందిన బస్సు ఆదివారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 20 మందికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన 10 మందిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -



