మేడ్చల్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం..

నవతెలంగాణ – హైదరబాద్: మేడ్చల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 వద్ద రోడ్డు ఘోర సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా డ్రైవ్ చేస్తున్న XUV 700 కారు ఎదురుగా వస్తున్న ఇన్నోవా ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అని ఎస్సై నవీన్ రెడ్డి తెలిపారు. మృతుడు వనస్థలిపురానికి చెందిన రెడ్డప్ప రెడ్డిగా గుర్తించారు. ఈ  మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love