– అనాధలుగా మారిన ముగ్గురు కుమార్తెలు
నవతెలంగాణ శంకరపట్నం
కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, ఎరడపల్లి గ్రామంలో నాడు తండ్రి ,నేడు తల్లి అనారోగ్యానికి గురై మృతి చెందిన ఘటన చోటు చేసుకోవడంతో, ముగ్గురు కుమార్తెలు అనాధలుగా మారినట్లు గ్రామస్తులు తెలిపారు. ఏరాడపల్లి గ్రామానికి చెందిన కనకం సంపత్- స్వరూప అనే దంపతులకు ముగ్గురు కుమార్తెలే, కొన్ని ఏళ్ల క్రితం తండ్రి సంపత్, అనారోగ్యానికి గురై మృతిచెందగా,తల్లి స్వరూప కూలి నాళీ చేసి తన ముగ్గురు బిడ్డలను సాకింది. సంపత్ అన్న, కుటుంబ సభ్యులు పెద్ద కుమార్తెకు, వివాహం చేసినారని, అక్షిత, అస్మిత మరో ఇద్దరూ కుమార్తెలు తల్లిదండ్రులు లేని అనాధలు అయ్యారని, సంపత్ స్వరూప ముగ్గురు కుమార్తెలను ప్రభుత్వం, మానవత్వం ఉన్న ప్రతి పౌరుడు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.