బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిరక్షణ కోసం పోరాడండి

– కాంట్రాక్టు కార్మికుల హక్కుల కోసం ఉద్యమించండి : బీఎస్‌ఎన్‌ఎల్‌ క్యాజువల్‌, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆలిండియా ప్రధాన కార్యదర్శి అన్వేశ్‌ మిత్ర పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఎస్‌ఎన్‌ఎల్‌ కాంట్రాక్టు కార్మికులు తమ హక్కులు, ఆ సంస్థ పరిరక్షణ కోసం పోరాడాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ క్యాజువల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ ఫెడరేషన ఆలిండియా ప్రధాన కార్యదర్శి అన్వేశ్‌ మిత్ర పిలునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ క్యాజువల్‌ కాంట్రాక్టు వర్కర్ల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బి.మధు అధ్యక్షతన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేశ్‌ మిత్ర మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలో కాంట్రాక్టు సిస్టమ్‌ రద్దు చేశారనీ, సర్వీసు లెవెల్‌ అగ్రిమెంట్‌ పద్ధతిలో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు.
కాంట్రాక్టు వర్కర్లందరూ కనీస వేతనాల కోసం బీఎస్‌ఎన్‌ఎన్‌లోని ఇతర సంఘాలతో ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సద స్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లా యీస్‌ యూనియన్‌ తెలంగాణ సర్కిల్‌ కార్యదర్శి జి. సాంబశివరావు, కాంట్రాక్టు వర్కర్ల సంఘం జనరల్‌ సెక్రటరి బి. పరిపూర్ణాచారి, ఏఐ బీడీపీఏ సర్కిల్‌ కార్యదర్శి రామ చంద్రుడు, ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్టు వర్కర్ల సంఘం జనరల్‌ సెక్రటరి కె. ప్రభాకరరావు, రాష్ట్ర అధ్యక్షులు తిరు మలాచార్యులు, ప్రధాన కార్యదర్శి పరిపూర్ణాచారి, బీఎస్‌ ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకు లు నారాయణ, సుశీల్‌ కుమార్‌, హరిప్రసాద్‌, నవీన్‌, నాయుడు, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love