ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి:  మండలంలోని ఉప్లూర్ పుట్లూరు గ్రామానికి చెందిన  చిప్పల ప్రతాప్ ఇంటి నిర్మాణం కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొమ్ముల రవీందర్ ఆర్థిక సహాయం అందజేశారు. భారీ వర్షం వలన చిప్పల ప్రతాప్పెంకుటిల్లు కూలిపోయింది. బాధితుడు చిప్పల ప్రతాప్ కూలిపోయిన ఇంటిని బాగు చేసుకునేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు కొమ్ముల రవీందర్ ముందుకు వచ్చారు. అందులో భాగంగా శనివారం బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. ఇంటి నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం అందించిన  కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాధిత  కుటుంబ సభ్యులు  ధన్యవాదాలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పి రెడ్డి శ్రీనివాస్, నాయకులు చింతకుంట శ్రీనివాస్, బోనగిరి  లక్ష్మణ్, అవారి సత్యం, నల్ల  మోహన్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love