నవతెలంగాణ – పెద్దపల్లి: అనాధ విద్యార్థినులకు కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషన్ రెడ్డి ఆయన స్నేహితుల తో కలిసి అనాధ విద్యార్థినులకు గురువారం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో 15000. రూపాయల ఆర్థిక సహాయం అందించారు. పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన, తండ్రి కలవేన రాజయ్య ఆరు సంవత్సర ముల క్రితం మరణించారు, తల్లి రజిత ఈ నెల 5వ తేదీన మరణించింది. అక్షయ ఐటిఐ, ఎలక్ట్రీషియన్ పూర్తి చేసినది. శ్రీవిద్య కొత్తపల్లి పాఠశాలలో 9వ తరగతి చదువు చున్నది నిస్సహాయ స్థితిలో ఉన్న అక్షయ, శ్రీవిద్యా, విద్యార్థుల వివరాలు తెలుసుకొని వారికి ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.