స్నేహితుడి కుమార్తెకు ఆర్థిక సహాయం

– రూ. 35వేల చెక్కు అందజేసిన డాక్టర్‌ ముజీబ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
అకాల మరణం చెందిన చిన్ననాటి స్నేహితుడి కుమార్తె దివ్యకు తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.ఎం.హుస్సేనీ(ముజీబ్‌) సోమవారం నాంపల్లి గృహాకల్పలోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ముజీబ్‌ మాట్లాడుతూ తన చిన్ననాటి స్నేహితుడు రఘు రెండేండ్ల క్రితం అనుకోని పరిస్థితులలో మృతిచెందాడని, గతేడాది అతని భార్య మరణించడంతో వారి ఏకైక కుమార్తె దివ్య అనాథగా మారిందని గుర్తుచేశారు. మిత్ర ధర్మం ఆచరించి దివ్య ఆలనాపాలనాను తనతో పాటు తన కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకుంటామని భరోసానిచ్చారు. అలాగే దివ్య చదువుతో పాటు వివాహ భాద్యతనూ తమదేనని అభయం ఇచ్చారు. ఈ సందర్బంగా ఒవైసీ కాలేజీలో చదువుతున్న దివ్య సెకండ్‌ సెమిస్టర్‌ ఫీజు రూ.35వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విక్రమ్‌ కుమార్‌తో పాటు కేంద్ర సంఘం నాయకులు, జిల్లా సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love