
రాజంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన నర్సింలు 2007 సంవత్సరంలో భిక్కనూరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివాడు. ఇటీవల అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు బుధవారం 18 వేల 500 రూపాయల ఆర్థిక సహాయాన్ని నర్సింలు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తుడుం జీవన్, తదితరులు పాల్గొన్నారు.