టెస్టు క్రికెటర్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు

For Test cricketers Financial incentives– భారత క్రికెట్‌ బోర్డు సరికొత్త పథకం
ముంబయి : దేశవాళీ రంజీ ట్రోఫీలో ఆడేందుకు నిరాకరించిన ఇద్దరు స్టార్‌ క్రికెటర్లను వార్షిక కేంద్ర కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ).. కొద్దిరోజుల్లోనే టెస్టు క్రికెటర్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు సరికొత్త ప్రణాళిక తయారు చేసింది. టెస్టు క్రికెట్‌ ప్రాధాన్యత, టెస్టు క్రికెటర్ల శ్రమకు గుర్తింపు అందించేందుకు బీసీసీఐ ఇక నుంచి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనుంది. ఓ సీజన్‌లో భారత్‌ ఆడే మొత్తం టెస్టు మ్యాచుల్లో కనీసం 50 శాతానికి పైగా మ్యాచుల్లో ఆడిన క్రికెటర్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం టెస్టు మ్యాచ్‌కు అందిస్తున్న మ్యాచ్‌ ఫీజు రూ.15 లక్షలకు ఇది అదనం. 75 శాతం కంటే ఎక్కువ టెస్టుల్లో ఆడిన క్రికెటర్లు ప్రతి టెస్టుకు రూ. 45 లక్షల చొప్పున అందుకోనుండగా, 50 శాతం కంటే ఎక్కువ మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్లు రూ.30 లక్షలు దక్కించుకోనున్నారు. ఇదే విధంగా బెంచ్‌కు పరిమితమైన ఆటగాళ్లకు సైతం గరిష్టంగా ప్రతి మ్యాచ్‌కు రూ.22.50 లక్షలు, రూ.15 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

Spread the love