Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తుంగతుర్తిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి: సర్పంచ్

తుంగతుర్తిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-తుంగతుర్తి
నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు,విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాదాలు జరిగినప్పుడు 40 కిలోమీటర్ల దూరం నుండి అగ్నిమాపక యంత్రం వచ్చేసరికి,జరగాల్సిన నష్టమంతా జరుగుతుందన్నారు.తుంగతుర్తి జనాభా భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని,తుంగతుర్తి మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -