– వానాకాలం 2026 కు ముందస్తు ప్రణాళికపై ఏడీఏ పెంటేల రవికుమార్ సూచన
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాబోయే వానాకాలం – 2026 సీజన్‌లో మార్కెట్ అవసరాలు, వినియోగదారుల అభిరుచి, మిల్లింగ్ సామర్థ్యం, ఎగుమతి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు డిమాండ్ ఉన్న వరి రకాల సాగుపై దృష్టి సారించాలని ఏడీఏ పెంటేల రవికుమార్ సూచించారు. ముఖ్యంగా తక్కువ నూక అయ్యే లక్షణం (హై హెడ్ రైస్ రికవరీ) కలిగిన వరి రకాలను సాగు చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంటేల రవి కుమార్ తెలిపారు.
వినియోగదారుల కోసం కుకింగ్ క్వాలిటీ, మిల్లర్ల కోసం మిల్లింగ్ క్వాలిటీ, ఎగుమతి అవసరాలకు అనుగుణంగా సన్న మరియు దొడ్డు రకాల వరి ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ప్రోత్సహించాల్సిన సన్న రకాలు :
బీపీటీ–5204
తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్–15048)
కెఎన్‌ఎం–1638
జైశ్రీరామ్
హెచ్‌ఎంసీ / హెచ్‌ఎం టీ
డబ్ల్యూజీఎల్–962
డబ్ల్యూజీఎల్–44
జీజీఎల్–1798
సాగు నిరుత్సాహపరచాల్సిన సన్న రకాలు :
గంగా కావేరి
ఎంటీయూ–1224
ప్రోత్సహించాల్సిన దొడ్డు రకాలు :
ఐఆర్–64
ఎంటీయూ–1010
కెఎన్‌ఎం–118
సాగు నిరుత్సాహపరచాల్సిన దొడ్డు రకాలు :
ఎంటీయూ–1001
జీజీఎల్–24423
ఎంటీయూ–1153
ఎంటీయూ–1156
అలాగే వానాకాలం ప్రారంభానికి ముందే ఈ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విత్తన తయారీదారులు, డీలర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు సమన్వయంతో పనిచేసి నాణ్యమైన విత్తనాలు అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మార్కెట్‌లో డిమాండ్ లేని రకాల స్థానంలో డిమాండ్ ఉన్న రకాలను సాగు చేసేలా చైతన్యం కల్పించాలని పేర్కొన్నారు.
వానాకాలం – 2025 వరి సాగు విస్తీర్ణం (ఎకరాల్లో):
అన్నపురెడ్డిపల్లి – 7,900
అశ్వారావుపేట – 7,846
చంద్రుగొండ – 4,402
దమ్మపేట – 9,712
ములకలపల్లి – 10,346
మొత్తం సాగు విస్తీర్ణం : 40,206 ఎకరాలు



