Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తిర్మలాపురం సర్పంచ్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తిర్మలాపురం సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  
యాదాద్రి పర్యటనకు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని,ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డిని బిఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రికి బస్వపూర్ రిజర్వాయర్ లో మా బిఎన్ తిమ్మాపురం గ్రామ పంట భూములతో పాటు మా స్థిర నివాసాలైన ఇండ్ల ను సైతం కోల్పోయి సర్వస్వం కోల్పోతున్నామని తెలుపుతూ,మాకు రావలసిన ఇండ్ల నష్టపరిహారం, ఆర్&ఆర్ కాలనీ అభివృద్ధి నిధులు 134 కోట్లు మంజూరు చేస్తే మాకు కేటాయించిన ఆర్&ఆర్ కాలనిలో పూర్తి స్థాయి లో ఇండ్లను నిర్మించుకుంటామని, ఆర్&ఆర్ కాలనీ అభివృద్ధి పనులు కూడా పూర్తవుతాయని తెలిపి వినతి పత్రాన్ని అందజేశారు.

నూతన ఆర్&ఆర్ కాలనిలో కూడా మౌలిక వసతులు రోడ్లు,మంచినీరు, డ్రైనేజీ,స్కూల్ బిల్డింగ్ నిర్మాణాలు అన్ని ఏర్పాట్లు చేసి కాలనీని పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలో మీ నష్టపరిహారం విడుదల చేస్తామని హామీ ఇచ్చారని సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి  తెలిపారు.ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి నష్టపరిహారాన్ని త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చిన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి  నిరంతరం బిఎన్ తిమ్మాపురం నష్టపరిహారనికై అహర్నిశలు కృషి చేస్తున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డిbకి మా బిఎన్ తిమ్మాపురం గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -