తెలంగాణలో తొలి అన్నక్యాంటీన్‌ ప్రారంభం

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
తెలుగు రాష్ట్రాల్లో తేదేపా బలోపేతానికి కృషి చేస్తామ ని చంద్రబాబు స్ఫూర్తిగా సీబీ ఎన్‌ ఫోరమ్‌ కొనసా గుతుందని జెనెక్స్‌ అమర్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన అన్న క్యాంటీన్‌ తెలంగాణలోని హైదరాబాద్‌ లో ఏర్పాటైంది. సీబీఎన్‌ ఫోరం ఫౌండర్‌, ప్రధాన కార్యదర్శి జెనెక్స్‌ సంస్థ అధినేత జెనెక్స్‌ అమర్‌ మాదాపూర్‌లోని 100 ఫీట్‌ ఎక్స్‌ రోడ్స్‌లో ఈ క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్‌ను జెనెక్స్‌ అమర్‌ పలువురు ప్రముఖలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏర్పా టు చేసిన అన్న క్యాంటీన్లు నిరుపేదల ఆకలి తీర్చి రాష్ట్ర ప్రజల ఆదరణ పొందాయన్నారు. జూలై మొదటి వారం నుండి క్యాంటిన్‌ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయ న్నారు. గత సంవత్సరం నవంబరులో ఊపిరిపోసుకున్న సీబీఎన్‌ ఫోరం ఇక ముందు కూడా పలు సేవా కార్యక్ర మాలతో ముందుంటుందని ఫోరమ్‌ వ్యవస్థాపక జనరల్‌ సెక్రటరీ జెనెక్స్‌ అమర్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్‌, చంద్ర బాబుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఫోరమ్‌ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. అనంతరం అమర్‌ తోపాటు పలువురు అతిధులు కలిసి కేక్‌ చేశారు.

Spread the love