నేడు లిల్లీపుట్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం

నవతెలంగాణ -ఆర్మూర్: పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో చాచా నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పాఠశాల కరస్పాండెంట్ రాజుల దేవి రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో సైతం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ,హిందీ దివాస్, వినాయక చవితి సందర్భంగా చిన్నారులతో మట్టి ప్రతిమలు తయారు చేయించడం జరిగిందని, వీటితో పాటు ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులు చదువులో ముందుండేందుకు కృషి చేస్తూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Spread the love