ఫుట్‌బాల్ దిగ్గజం లూయిస్ సూరెజ్ క‌న్నుమూత‌..

నవతెలంగాణ-హైదరాబాద్ : స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గ‌జం లూయిస్ సూరెజ్ మిర‌మొంటెస్‌ క‌న్నుమూశాడు. ‘గోల్డెన్ గ‌లిసియన్‌’గా పేరొందిన అత‌ను 88 ఏళ్ల వ‌య‌సులో తుదిశ్వాస విడిచాడు. లూయిస్ మ‌ర‌ణ వార్త‌ను అత‌ను గ‌తంలో కోచ్‌గా ప‌నిచేసిన‌ ఇంట‌ర్ మిల‌న్ క్ల‌బ్ వెల్ల‌డించింది. అయితే.. అత‌డు చ‌నిపోవ‌డానికి కార‌ణం ఏంట‌నేది మాత్రం వెల్ల‌డించ‌లేదు. మిడ్‌ఫీల్డ‌ర్‌గా ఓ వెలుగు వెలిగిన అత‌ను సాక‌ర్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన బాల‌న్ డి ఓర్ అవార్డును 1960లో అందుకున్నాడు. ఈ అవార్డు గెలిచిన‌ ఏకైక స్పెయిన్ ఆట‌గాడిగా లూయిస్ గుర్తింపు సాధించాడు. లూయిస్‌ పుట్టి పెరిగిందంతా స్పెయిన్‌లోని గ‌లిసియాలో. కానీ, అత‌ను ఇటలీ జ‌ట్టుకు ఎన్నో ట్రోఫీలు అందించాడు. వాటిలో.. 1964 యూరోపియ‌న్ క‌ప్, 1965 ఇటాలియ‌న్ లీగ్ టైటిల్స్ ముఖ్య‌మైన‌వి. రెండు సార్లు స్పానిష్ లీగ్ టైటిల్స్ గెలిచాక లూయిస్ బార్సిలోనా క్ల‌బ్‌కు మారాడు.

Spread the love