నిరంతర వైద్యసేవల కోసం…

– కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 040-24651119 ఏర్పాటు:మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకుగాను రాష్ట్ర స్థాయిలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ‘ 040-24651119’ ఏర్పాటు చేసినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇదే విధంగా జిల్లా స్థాయి లో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయా లని వైద్యాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్యా రోగ్య శాఖ సన్నద్ధత, ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అన్ని విభాగాల ఉన్నతాధికా రులు, జిల్లా వైద్యాధికారులతో గురు వారం సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైద్యసేవలకు అంతరాయం కలగ కుండా ఉపకేంద్రం నుంచి హైదరా బాద్‌లోని ప్రధాన ఆస్పత్రుల వరకూ పూర్తి సంసిద్ధతతో ఉండాలని ఆదేశిం చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలందించేందుకు అవసరమైతే హెలికాప్టర్‌ సేవలను వినియోగిస్తామని స్పష్టం చేశారు. 108, 102 వాహన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లను ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్లు సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించాలని కోరారు. జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రులతో పాటు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, మాతా,శిశు కేంద్రాలు, ఆస్పత్రులలో అత్యవసర వైద్యసేవలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాతావరణశాఖ సూచనలను పాటించాలనీ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love