
నందిపేట మండలంలోని సిహెచ్ కొండూర్ అడవి ప్రాంతంలో ఇటీవల పులి సంచరిస్తుంది అని నందిపెట్ మండల ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ బుధవారం తెలిపారు. పలువురు సోషల్ మీడియాలో తెలుపడంతో అటవీ అధికారులు జంతువును గుర్తించడానికి అధునాతనమైన కెమెరాలను బిగించడం జరిగింది అని అన్నారు. వాటి కదలికలు కెమెరలో ఆటోమేటిక్ బంధించడం జరుగుతుందని అడవిలోకి ఒంటరిగా వెళ్లకూడదని అడవి జంతువులకు ఎటువంటి ప్రాణహాని చేయరాదని సూచించారు.