క్షమ, ప్రేమకు మించిన గుణంలేదు

There is no quality greater than forgiveness and love–  ఏసు ప్రభువును స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలి : మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహా గిఫ్ట్‌ప్యాక్‌ల అందజేత
నవతెలంగాణ-జోగిపేట
క్షమ, ప్రేమకు మించిన గుణం లేదనే గొప్ప సందేశాన్ని.. ఏసు ప్రభువు 2వేల ఏండ్ల క్రితం తన త్యాగం ద్వారా చెప్పారని వైద్యారోగ్యశాఖ మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్‌హాల్‌లో క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం తరపున క్రిస్మస్‌ గిఫ్ట్‌ ప్యాకెట్‌లను ఆదివారం రాత్రి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ధర్మాన్ని కాపాడేందుకు ఏసు ప్రభువు లాగా మన పాత్ర ఉండాలన్నారు. సమాజంలో గెలుపు, ఓటములు నిరంతర ప్రక్రియ అన్నారు. ప్రసంగాలు వినడానికి గొప్పగా ఉన్నప్పటికీ.. వాటి ఆచరణ చాలా కష్టంగా ఉంటుందన్నారు. అనంతరం చర్చి ఫాదర్‌లతో కలిసి కేక్‌ను కట్‌ చేసారు. చర్చి ఫాదర్‌లు మాణిక్యం, విజరుతో పాటు పలువురు మంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం అందోలు నియోజకవర్గంలోని అందోల్‌, పుల్కల్‌, చౌటకూరు, వట్‌పల్లి, టేక్మాల్‌ మండలాలకు చెందిన క్రైస్తవ సోదర, సోదరీమణులకు గిఫ్ట్‌ ప్యాక్‌లను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ పాండు, ఎంపీడీవో సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్‌ మధుకర్‌రెడ్డి, జడ్పీటీసీ సరోజ, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love