చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్‌ కన్నుమూత

Former Prime Minister of China Li Keqiang passed away– చైనా అధ్యక్షుడికి సన్నిహితుడిగా గుర్తింపు
బీజింగ్‌: చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్‌ (68) కన్నుమూశారు. గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కెకియాంగ్‌ మృతి చెందినట్టు స్థానిక మీడియా తెలిపింది. 2013 నుంచి మార్చి 2023 వరకు చైనా ప్రధానిగా ఉన్నారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఆయన అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఈ ఏడాది మార్చిలో ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. అనంతరం ఆయన షాంఘైలో విశ్రాంతి తీసుకొంటున్నారు. పేకింగ్‌ యూనివర్శిటీలో లీ కెకియాంగ్‌ ఆర్థికవేత్తగానూ పనిచేశారు. సాధారణంగా సిసిపిలో ఇంజినీర్ల ఆధిపత్యం ఎక్కువ. కానీ, లీ ఆర్థిక వేత్త కావడం గమనార్హం. చైనాలోని అన్హుయి ప్రావిన్స్‌లో గల ఓ కమ్యూనిస్టు పార్టీ అధికారి ఇంట్లో లీ కెకియాంగ్‌ జన్మించారు. చిన్నతనంలో వ్యవసాయంపై ఆకర్షితులైనా, ఆ తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీలో శక్తిమంతమైన నేతగా ఎదిగారు.

Spread the love