ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

నవతెలంగాణ – కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని శనివారం తన నివాసం కార్యాలయం వద్ద పలు బస్తీలకు చెందిన ప్రజలు, నాయకులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మర్యాదపూర్వకంగా కలిసి స్థానికంగా ఉన్న పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో  మాట్లాడి, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాను కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.
Spread the love