చండూరు మున్సిపల్ పట్టణ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ” స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ” వర్ధంతి సందర్బంగా స్థానిక చౌరస్తాలో ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ దోటిసుజాత వెంకటేష్ యాదవ్, నల్లగొండ ట్రస్మా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ లు కోడి గిరిబాబు, కల్మికొండ జనార్దన్, నల్లగంటి మల్లేశ్, రామ్మూర్తి, భూతరాజు దశరథ, గుండూరి జనార్ధన్, పన్నాల లింగయ్య, చొప్పరి రాజు, చంద్రశేఖర్, అహ్మద్, మాస కృష్ణ, ఇరిగి వెంకటేశం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.