మూడు వర్గాలపై నాలుగు కేసులు నమోదు

– ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలి
– పాటించని వారిపై కేసులను నమోదు చేస్తాం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడి
నవతెలంగాణ- కంఠేశ్వర్:
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలని ఒకవేళ పాటించని వారిపై కేసులను నమోదు చేస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఎడపల్లి మండలం సాదాపూర్ గేటు వద్ద జరిగిన గలాటాలు మూడు వర్గాలపై 4 కేసులను నమోదు చేయడం జరిగిందని గురువారం ప్రకటనలో తెలిపారు. ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద పండరీపూర్ టీ హోటల్లో 3 గుర్తింపుపొందిన పార్టీలకు చెందినవారు మూడు వర్గాలుగా ఏర్పడి గలాట చేసుకొన్న క్రమంలో ఒక వ్యక్తికి గాయమయింది. మిగితా వాళ్లకు గాయాలు కాలేదు. ఈ సందర్భంగా పోలీసువాళ్లు ఎంత నచ్చచెప్పిన వినలేని సందర్భంలో లారీచార్జీ చేసి, 3 వర్గాలపై 4 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. తేది : 22-11-2023 నాడు బోధన్ ఎమ్.ఎల్.ఎ మహ్మద్ షకీల్ ఆమేర్ 8 గ్రామాలలో ( అంబెం, ఎ.ఆర్.పి క్యాంప్, బ్రహ్మణపల్లి, జైతాపూర్, ఎమ్.ఎస్ ఫామ్, ఒడ్డెపల్లి, ధర్మారం, జమ్లమ్ ) గ్రామాలలో కార్యక్రమాలు గలవు. ఆ గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి యువకులు / మహిళలు ప్రశ్నించడానికి గుమిగుడిన సందర్భంలో వేరేపార్టీకి చెందిన వారు వచ్చి ఒక్కరు ఒక్కరు తోసుకున్నారు. ఎక్కడ కూడా ఎమ్.ఎల్.ఎ మీద దాడి జరుగలేదు. సాటాపూర్ క్రాస్ రోడ్డులో పండరీపూర్ హోటల్లో మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు వాగ్వివాదము చేసుకొని కొట్లాడుకున్నారు. దీని తర్వాత వాళ్ల పార్టీకి చెందిన వారిని పిలిపించుకొని అక్రమ సమావేశం అయి ప్రజలకు అసౌకర్యం కలిగించారు. అలాగే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. దీనితో మూడు పార్టీలకు చెందిన కార్యకర్తల పై కేసులు నమోదు చేయడం జరిగిందని, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇరు వర్గాల మీద ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన సందర్భంగా మూడు వర్గాల పై సెక్షన్ 149 ఐ.పి.సి  చట్ట విరుద్ధంగా సమావేశం కావడం,
సెక్షన్ 160 ఐ.పి.సి అఘయిత్యానికి పాల్పడటం,
సెక్షన్ 290 ఐ.పి.సి బహిరంగంగా ఇబ్బంది పెట్టడం,
సెక్షన్ 324 ఐ.పి.సి  ప్రమాధకరమైన స్వచ్ఛందంగా గాయపర్చడం, సెక్షన్ 341 ఐ.పి.సి తప్పు నిర్భందం,
సెక్షన్ 427 ఐ.పి.సి నష్టం కలిగించడం, సెక్షన్ 506 ఐ.పి.సి నేర పూరిత బెదిరింపులు, సెక్షన్ 123 ఆఫ్ ఆర్ పి యాక్టు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ప్రకారంగా కేసులు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. కావున అన్ని పార్టీ అభ్యర్థులకు / కార్యకర్తలకు / ప్రజలకు తెలియపర్చునది ఏమనగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున అన్ని పార్టీల వారు అభ్యర్థులు / కార్యకర్తలకు పర్మీషన్ తప్పకుండా తీసుకొని ప్రచారం చేసుకోవడానికి  వెళ్లాలని తెలియజేశారు. అటువంటి కార్యక్రమాలను అడ్డుకోవడం నేరం, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారు అవుతారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు.
Spread the love