కాల్పుల మోత..నలుగురు మావోయిస్టులు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నారాయణపూర్ జిల్లా అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love