నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు నివారణ టీకాలను ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, పశు వైద్యాధికారి దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మాట్లాడుతూ గత నెల 31 నుండి ఈనెల 30వ తేదీ వరకు మండలంలోని ప్రతి గ్రామాలలో పశువులకు గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటివరకు తిప్పాపూర్, మోటాట్ పల్లి, బంజర్ల, కాచాపూర్ గ్రామాలలో పశువులకు గాలికుంటు టీకాలు వేయడం జరిగిందన్నారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని సూచించారు. కాచాపూర్ గ్రామంలో 250 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిద్ధా గౌడ్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది అహల్య, ప్రదీప్, బాబు, గోపాలమిత్ర మహేష్ గౌడ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.