
ఉచిత మెగా వైద్య శిబిరం భువనగిరి పట్టణంలోని ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్, స్థానిక సర్పంచ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 105 వ ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం నందు ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా అవసరం అని ఏదైనా సరే ముగ్గుగా ఉన్నప్పుడే తుంచి వేయాలి అన్నట్లు వ్యాధి పూర్తిగా ముదరక ముందే నిర్ధారణ చేసుకొని దానికి అవసరమాకు చికిత్స చేయించుకోవడం వలన ప్రజలకు సమయం , డబ్బు వృధా కాకుండా ఉంటుందని అన్నారు . ఈ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సమాజం కోసం ఎంతో సేవ చేస్తున్న డాక్టర్ రాజకుమార్ ని, వారి సతీమణి డాక్టర్ చావా ఆశ్లేష ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ వైద్య శిబిరం నందు ఎంపీపీ చీర శ్రీశైలం, ఉప ఎంపీపీ నల్లబోలా ప్రసన్నా రెడ్డి , మాజీ సర్పంచ్ బీర్ల శంకర్ మాజీ ఉప సర్పంచ్ దుంబాల సురేఖ వెంకట్ రెడ్డి , గ్రామ పెద్దలు , ఆస్పత్రి సిబ్బంది హాజరయ్యారు.ఈ వైద్య శిబిరం నందు సుమారు 150 మందికి పైగా పరీక్షలు నిర్వహించి వారికి అవసరమగు మందులను ఉచితంగా పంపిణీ చేశారు.