నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 18న ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు జుక్కల్ నియోజకవర్గముస్తాయి మంచినీళ్ల పండుగను మద్నూర్ మండలం షైకాపూర్ గ్రామంలో గంటలకు నిర్వహించడం జరుగుతుంద నీ ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఏఈ గణేష్ ఒక ప్రక్కన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జుక్కల్ నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు హన్మంత్ షిండే జహీరాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు బి. బి. పాటిల్ కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ దాఫెదర్ శోభా రాజుజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెడ్పి సీఈఓ సాయా గౌడ్ బాన్సువాడ డివిజన్ ఆర్దీవో రాజా గౌడ్ మద్నూర్ మండలం లో గల ప్రజా ప్రతినిధులు, అదికారులు, అనథికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆయన విజ్ఞప్తి చేశారు.