– మధ్యప్రదేశ్‌లో మారుతున్న రాజకీయ సమీకరణలు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఏడాది చిరవలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీలోని కొంతమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన కొలారస్ ఎమ్మెల్యే వీరేంద్ర రఘువంశీ కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సమక్షంలో వీరేంద్ర రఘువంశీ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా కమల్‌నాథ్ మాట్లాడుతూ.. ‘కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింథియా వర్గానికి చెందిన వారే కాకుండా.. ఇతర బీజేపీ నేతలు చాలామంది నాతో టచ్‌లో ఉన్నారు. సింధియాకు నమ్మిన బంటుగా ఉన్న సమందర్ పటేల్ కూడా గత నెల్లో స్థానిక కాంగ్రెస్ నాయకత్వం అనుమతితోనే పార్టీలోకి చేరా రు.’ అని ఆయన అన్నారు. కాగా, రఘువంశీ బీజేపీ వీడిన మరుసటి రోజే శుక్రవారం రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గిరిజ శంకర్ బీజేపీకి రాజీనామా చేయడం గమనార్హం. అలాగే.. వింధ్య ప్రాంతానికి చెందిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, మహాకౌశల్, బుందేల్‌ఖండ్ ప్రాంతాలకు చెందిన బీజేపీ నేతలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గడచిన మూడు నెలల కాలంలో పలువురు బీజేపీ నేతలు ఆ పార్టీని వీడి కాం గ్రెస్‌లోకి చేరారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి కైలాష్ జోషి కుమారుడు మాజీ మంత్రి దీపక్ జోషి, మాజీ ఎమ్మెల్యే రాధేలాల్ బాఘేల్, మాజీ ఎమ్మెల్యే కున్వర్ ధ్రువ్ ప్రతాప్‌సింగ్, మాజీ ఎమ్మెల్యే దేశరాజ్ సింగ్ కుమారుడు యద్వేంద్ర సింగ్, సమందర్ సింగ్ పటేల్ ఉన్నారు. వీరితోపాటు బిజెపి మాజీ ఎంపి మఖాన్ సింగ్ సోలంకి బిజెపికి రాజీనామా చేసి ఏప్రిల్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ వర్క్ షాప్‌లో పలువురు కమిషనర్లు, ఎస్పీలు, ఐజీలు పాల్గొనగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కూడా అయిన స్టీఫెన్ రవీంద్ర కోఆర్డినేటర్‌గా వ్యవహరించాడు.