మృత్యు కోరల్లోంచి..!

 From the jaws of death..!వారు భక్తులవునో కాదో తెలీదు కానీ, ‘మార్కండే యులే!’ శివలింగాన్ని కౌగిలించుక్కూచోలేదు. అది వాళ్లక క్కడ అందుబాటులో లేదు కూడా! పాశం విరిసింది ‘యము డు’ కాదు. నయా ఉదారవాదవిధానాలు. సిల్కియారా బార్‌ కోట్‌ టన్నెల్‌ కూలి దాన్లో ‘డాష్‌’ సంఖ్యలో కార్మికులు ఇరు క్కున్నారు. ఈ ‘డాష్‌’కు కారణమేమంటే ఆ టన్నెల్‌ పనుల గుత్తేదారు హైదరాబాద్‌లో రిజిస్టర్‌ అయిన నవయుగ కన్‌ స్ట్రక్షన్‌ కంపెనీ. ఆ నవయుగ వారి దగ్గర ఆ పాపిష్టి తేదీ నాడే (నవంబర్‌ 12), ఆ తెల్లవారుజామున ఎందరు డ్యూటీ కెళ్లారో లెక్కలేదట! రోజూ 150-200 మంది పని చేస్తారు గాని, దీపావళి రోజులు కావడం వల్ల కొందరు డుమ్మాలు కొట్టారట! అప్పటిదాకా నలభై అన్నారు. తర్వాత నలభై ఒక టంటున్నారు. కాకిలెక్కలా! కొన్ని ఇంగ్లీషు ఛానల్స్‌ పదహారు మందిని ఎండోస్కోప్‌ చిత్రంలో చూపిం చాయి. ఈ మానవకోణం బహుశా మీడియాకి పట్టదు కాబోలు!
అక్కడ అడ్డం పడింది డెబ్బయి మీటర్ల మందమున్న బండలు, ఇతర శిథిలాలు. కుటుంబ సభ్యులు బయట పూ జలు చేయడం టీవీల్లో చూపిస్తున్నారు. ఎందరో లెక్కతెలీక పోయినా, అందరూ పోయుంటేనో, కొందరైనా పోయుం టేనో ఎంత ఖర్చవుతుందో యాజమాన్యం లోపల లెక్క వేసుకుంటోంది కావచ్చు. ఇక్కడ మొదటి దోషి డబుల్‌ ఇం జన్‌ సర్కారే. వారు ఆబగా అమలు చేస్తున్న నయా ఉదార వాద విధానాలు. ఇక్కడ మానవ జీవితానికి విలువలేదు. బలిసే యాజమాన్యాల పొట్టలు, లోతైన వారి జేబులే! అందుకోసం మోడీ సర్కార్‌ ఎంతకైనా తెగిస్తుందనేందుకు ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు.
సరళీకృత ఆర్థిక విధానాలను మతోన్మాదంతో రంగ రించడంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు. అది అస్మదీ యులకు లాభాలకు లాభాలు పండిస్తోంది. ఓట్లకు ఓట్లు రాలు స్తుంది. చార్‌ధామ్‌ ప్రాజెక్టు ఆ కోవలోదే! నాలుగు పుణ్య క్షేత్రాలను కలుపుతూ (బదిరీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్‌, గంగోత్రి) 12 మీటర్ల వెడల్పయిన రోడ్‌కు 2016లో ప్రారంభోత్సవం చేశాడు మోడీ సాబ్‌. ఖర్చు రూ.12 వేల కోట్లు. నేల వదులుగా ఉండే (లూజ్‌ సాయిల్‌) హిమాలయ పర్వత సానువులో ఆ పని వల్ల తీవ్ర ప్రమాద మని అనేక మంది నిష్ణాతులు వాదించారు. చివరికి సుప్రీంకోర్టు ముందు ‘డబుల్‌ ఇంజన్‌’ వాదనేమంటే ఉత్తరాఖండ్‌ పొరుగునున్న చైనాతో యుద్ధమొస్తే సైన్యాన్ని యుద్ధ ట్యాంకులను కదిలించాలంటే ఇది అవసరమని, యాత్రీకులు త్వర త్వరగా ‘దర్శనాలు’ చేసుకుని బయట పడేందుకు అవసరమని చెప్పింది. ఎలాగో అనుమతులు సంపాదించుకున్నారు.
కొండలు, వాటిలోని బండల నిర్మాణం ఎలా ఉందో తెలుసుకోకుండా కొండల్ని కట్‌ చేయరాదని, నిష్ణాతుల పర్యవేక్షణలోనే రోడ్ల నిర్మాణం, సొరం గాల నిర్మాణం జరపాలని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మాజీ డైరెక్టర్‌ జనరల్‌ పి.సి. నవానీ చెప్పారు. బయటికి తప్పుకునే మార్గం (ఎస్కేప్‌ రూట్‌) లేకుండా 4.5 కి.మీ. సొరంగం తప్పని ఆయన మొత్తుకుంటున్నాడు. భూకంపాలు, భూ ప్రకంపనలు నిరంతరం ఉండే హిమాలయాల్లో ఈ చర్య అత్యంత ప్రమాదభరితమని మరొక నిష్ణాతుడు సి.పి.రాజేంద్రన్‌ చెప్తున్నారు. వంద కి.మీ.కు మించిన రోడ్‌ వేయాలంటే పర్యావరణ అనుమతులు తప్పనిసరి. చార్‌ధామ్‌ రోడ్‌ 900 కి.మీ. తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ దాన్ని 53 ముక్కలు చేసింది. ఏ అనుమ తులు అవసరం లేకుండా ‘బిందాస్‌’గా కాంట్రాక్టులిచ్చు కుంది. నేడు ప్రమాదం జరిగిన చోటే 2019లో జరిగింది. బాధ్యులెవరో తేల్లేదు. ఏ శిక్షలూ ఎవరికీ లేవు.
బార్‌కోట్‌ – సిల్కియారా టన్నెల్‌ నిర్మాణాన్ని నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ వారు ‘నవయుగ’ కిస్తే టన్నెల్స్‌ నిర్మాణంలో పేరున్న ఆస్ట్రియా-జర్మనీకి చెంది న మరో కంపెనీకి అప్పగించారు. తామనుకున్న దానికంటే ఈ టన్నెల్‌ నిర్మాణం ఒక సవాలుగా ఉందని సదరు ఆస్ట్రియా కంపెనీ వెబ్‌సైట్‌లో పెట్టారు. అయినా ఏ జాగ్ర త్తలూ తీసుకోలేదు. ఆశ్చర్యమేమంటే ప్రమాదం జరిగే వరకు నవయుగా వారి దగ్గర కటింగ్‌ యంత్రాల్లేవు. ప్రమాదం నవంబర్‌ 12న జరిగితే ఎలుకలు కలుగుల్లో బతికినట్లు ఎందరున్నారో తెలీదు. ఎవరు న్నారో తెలీదు. గాడాంధకారంలో బతుకు తున్నారు. బహుశా 18న ఎన్డోస్కోప్‌ ద్వారా కొంత వెలుగు, కుటుంబాలతో మాట్లాడిం చడం చేస్తున్నారు. యోగా చేయమని, ధ్యానం చేయమని బయట్నించి ఉచిత సలహాలకు కొదవలేదు. ఎవరు ఏ షేపులో బయటికొస్తారో తెలీదు కాబట్టి 41 అంబు లెన్స్‌లు ఆసుపత్రిలో 41 పడకలు సిద్ధంగా ఉంచారు.
మళ్లీ ఎన్నికలు జరిగేలోగా ఛార్‌ధామ్‌ రోడ్‌ వినియోగం రావడానికి 24/7 పనులు సాగుతున్నాయి. అందుకే అత్యంత ప్రాధాన్య తున్న దీపావళి ‘పర్వదిన’ రోజుల్లో కూడా ఆ అభాగ్య కార్మికులు పనుల్లోకి దిగారు. 13 రోజుల తర్వాతనైనా ఆ కార్మి కులందరూ సజీవంగా బయటికొస్తారనే ఆశిద్దాం. ఏ అవాంతరాలు లేకుండా ఈ టన్నెల్‌ నిర్మాణం పూర్తి కావాలి.

Spread the love