నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజలు బీఆర్‌ఎస్‌ను నమ్మె పరిస్థితి లేదని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు రాసిన ఉచిత సలహాల లేఖ హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బస్సులో రద్దీ పెరిగిందని చెబుతున్నారని అంటే… ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైందని ఒప్పకున్నట్టేనని తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని గుర్తుచేశారు.